యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో వెంకట్రావు గురువారం సాయంత్రం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు స్వామివారి కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు గిరి ప్రదక్షణ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.