ములుగు జిల్లా కేంద్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నేడు గురువారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టారు. అనంతరం ములుగు జాతీయ రహాదారి 163పై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేశ్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు ఎరువుల కోసం తీవ్రంగా గోస పడుతున్నారని, పాలకులకు రైతుల గోస కనబడుతున్నదని, ఒక్క యూరియా బస్తా కోసం రైతు 10 రోజులుగా లైన్ లో నిలబడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముందు చూపు లేని నాయకులు పాలిస్తున్నారు కాబట్టే ఈ