భారీ వర్షాల కారణంగా పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గ అమరావతి నుంచి విజయవాడకు వెళ్లే రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా స్థానికులు గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాట్లాడుతూ పెద్ద మద్దూరు వద్ద ఉన్న వంతెన పైకి కొండవీటి బాబు వరద నీరు భారీగా వస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల ప్రయాణికులు వాన దారులు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమరావతి నుంచి విజయవాడకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయ మార్గాలైన నరుకుల్లపాడు ఎండ్రాయి చావు పాడు గ్రామాల మీదగా ప్రయాణించవలసి వస్తుంది.