తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఉన్న అన్న క్యాంటీన్ ను జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ ఆకస్మికంగా తణిఖీర్ చేసారు. వెంకటగిరి న్యాయస్థానంలో మండల లీగల్ కౌన్సిల్లో వచ్చిన ఫిర్యాదు మేరకు. అన్నా క్యాంటీన్ ను అయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. ...రైస్ లో నాణ్యత లేదని గుర్తించారు. క్యాంటీన్ సూపర్ వైజర్ కు నాణ్యమైన భోజనము మంచి తాగు నీరు నిరుపేదలకు అందించాలని సూచించారు. అన్నా కాంటీన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశించారు.