జిల్లా వ్యాప్తంగా యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు నిలబడడంతో వ్యవసాయ అధికారులు చేతులెత్తేస్తున్నారు దీంతో పోలీసుల సాయంతో యూరియా పంపిణీ చేపట్టారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పీ ఎ సీ ఎస్ లు,ఆగ్రోస్ సేవా కేంద్రాలవద్ద వ్యవసాయ అధికారులు పోలీసుల సాయంతో యూరియా బస్తాల కూపన్లను పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మరియు సిరోలు మండలం కాంపల్లి గ్రామ రైతు వేదికలో ఎస్సై రమేష్ బాబు ,సంతోష్లు రైతుల పేర్లు మైకులో చదివి పిలుస్తూ యూరియా సరఫరా చేస్తున్నారు.