లోక్ సభలో ఈ నెల 03 న ఆమోదించబడిన వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గి పురపాలక కేంద్రం లో మజీద్ కమిటి ఆద్వర్యం లో మదీనా మస్జీద్ నుండి శివాజీ కూడలి వరకు, అక్కడి నుండి తహసిల్దార్ కార్యలయం వరకు ముస్లిమ్ లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సంధర్బంగా శివాజీ కూడలిలో మజీద్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలను అన్ని విధాలుగా అణిచివేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికి మెమొరండం అందజేశారు.