ఆత్మహత్య చేసుకున్న ములుగు మున్సిపల్ కార్మికుడు మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మాధవరావుపల్లె లోని మహేశ్ ఇంటికి నేడు ఆదివారం రెడ్కో మాజీ ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫోన్లో మహేశ్ తల్లితో మాట్లాడిన కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.