అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న సందర్శకుల వసతి కేంద్రంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అపస్మారక స్థితిలో పడి ఉన్నా ఆమెను గమనించిన స్థానికులు సమాచారాన్ని వైద్యులకు అందించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.