అతనో ఎంబిబిఎస్ చదివిన డాక్టర్. జల్సాలకు, బెట్టింగులకు అలవాటు పడి దొరికిన చోట అప్పు చేస్తాడు. తీరా అప్పు తీర్చాల్సి వస్తే అప్పిచ్చిన వ్యక్తికి ఇంజక్షన్ ఇచ్చి కడ తెరుస్తాడు ఈ కసాయి డాక్టర్. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఏలూరు వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు చైత్ర ఆసుపత్రిలో పనిచేస్తున్న భాను సుందరం అనే డాక్టర్ తెలిసిన వారి వద్ద అప్పు చేస్తాడని, తీరా అప్పు తిరిగి చెల్లించాల్సి వస్తే డబ్బులు అప్పు ఇచ్చిన వారికి మార్ఫిన్ ఇంజక్షన్ ఇచ్చి వారిని మంచానికి పరిమితం చేస్తారని తెలిపారు