ఐసిడిఎస్ ప్రాజెక్టు వాల్మీకిపురం పరిధిలోని కలికిరి మండలం గుట్ట పాలెం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు రాష్ట్రీయ గ్రామీణ సాక్షరత మిషన్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్స్ ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరుంధతి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో అన్ని రకాల సేవలు అందిస్తున్నదని పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలని తెలిపారు.