పేదల పక్షాన ఉంటూ వారి ఆర్థిక అభివృద్దె లక్ష్యంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని నిర్మల్ జిల్లా,ఖానాపూర్ మండల బిజెపి నాయకులన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పన్నులు తక్కువ చేసి సామాన్యునిపై భారం పడకుండ చూస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పేద,మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరగకుండా కేంద్ర ప్రభుత్వం వివిధ విధాలుగా జిఎస్టి పన్నులను తగ్గింపు చేసిందన్నారు. పేద ప్రజల అభివృద్దె లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.