ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సదరం రి వెరిఫికేషన్ పేరిట వికలాంగుల పర్సంటేజీ నిర్ధారిస్తూ పెన్షన్లను రద్దు చేస్తూ నోటీసులు జారీ చేశారని వాటిని ఉపసంహరించుకోవాలంటూ అల్లూరి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద నుండి ఐటీడీఏ వద్ద వరకు ఈ ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఐటిడిఏ గ్రీవెన్స్ లో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్లను రద్దు చేయడం న్యాయమా అంటూ ప్రశ్నించారు.