అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల భద్రత, చట్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శక్తి టీమ్ బృందాలు పలు పాఠశాలల్లో విద్యార్థులతో భద్రతా చర్చలు, మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించాయి.గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ తేడా, గుర్తించే పద్ధతులు.స్వీయ రక్షణ పద్ధతులు, ఈవ్ టీజింగ్ నివారణ.ప్రేమ పేరుతో జరిగే మోసాలు, అప్రమత్తత.పోక్సో చట్టం గురించి అవగాహన.