కృత్తివెన్ను గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద గురువారం జరిగిన స్త్రీ శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతి అని, మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.