ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... మంగళవారం మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రైతులు కొత్తకాపు రామదాసు, మార్శెట్టి వెంకటేష్ లకు చెందిన పశువుల పాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ అదుపులోకి రాలేదు. దింతో ప్రమాదంలో వ్యవసాయ సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు రైతులు వాపోయారు.