Parvathipuram, Parvathipuram Manyam | Aug 10, 2025
ఏమాత్రం చినుకుబడినా పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డు చెరువుగా మారుతుంది. సారిక వీధి జంక్షన్ మొదలుకొని కంగాట వీధి జంక్షన్ వరకు, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, స్మార్ట్ బజార్ జంక్షన్ తదితర ప్రాంతాలలో మోకాళ్ళలోతు మీరు నిలబడి ప్రయాణికులకు రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తోంది. మురుగు కాలువల్లో సీట్లు తొలగించకపోవడం వలన కాలువల్లో నీరు ప్రవహించక రోడ్డుపైకి రావటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ వద్ద ప్రస్తావించగా తగు చర్యలకు కార్యాచరణ రూపొందించామన్నారు.