వికారాబాద్ జిల్లాలో పలుచోట్ల ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై, మేకలపై దాడులు చేసి పీకు తింటున్న సంఘటనలు జరిగాయి. పరిగి లో సుమారు 16 మందిని విధి కుక్కలు దాడి చేయడంతో వారు గాయలపాలై ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. దారుర్ మండలం అంతారంలో వీధి కుక్కలు దాడిలో 12 మేకలు చనిపోయాయి, అదేవిధంగా గత రాత్రి మావిరి హాస్పిటల్ పక్కనే ఉన్న మేకల షెడ్డులో వీధి కుక్కలు దాడి చేసి 12 మేకలను చంపి తింటున్న దృశ్యాలు ఘోరంగా కనిపిస్తున్నాయి.