రఘునాథపల్లి మండలం ఖిలాషపూర్ గ్రామాన్ని జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం సందర్శించారు.జిల్లా పరిషత్ హై స్కూల్ లో మౌలిక వసతుల ను సంబంధిత విద్యాశాఖ అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు.త్రాగునీటి కొరకు బోరు మరమ్మత్తులు చేపట్టాలని అవసరమైతే కొత్త బోరు ఏర్పాటు చేయాలన్నారు.మరుగుదొడ్లు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు సూచించారు.పాఠశాల ఆవరణను చదును చేయించాలని క్రీడలకు వినియోగించాలన్నారు విద్యార్థుల కు వాలీబాల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా కిచెన్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.