Download Now Banner

This browser does not support the video element.

దేవరకొండ: డిండి మండల ఎంపీడీవో కార్యాలయాన్ని అకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Devarakonda, Nalgonda | Sep 2, 2025
నల్లగొండ జిల్లా: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం తెలిపారు .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆసరా పెన్షన్ లాంటివి వస్తున్నప్పటికీ ఈ పథకానికి అర్హులని తెలిపారు. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద ఒకేసారి 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. డిండి మండల ఎంపీడీవో కార్యాలయం ఆకస్మికంగా సందర్శించారు. ఆర్డీవో రమణారెడ్డి ఎంపీడీవో ఎస్ టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us