పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం రావాడ రామభద్రపురం సమీపంలో గల ఒట్టిగడ్డ రిజర్వాయర్ లో మోటారు సైకిల్ తో పాటు ఓ టీచర్ కొట్టుకుపోయిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మూటక చక్రపాణి అనే టీచర్ తన విధులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో అదుపుతప్పి ఒట్టిగడ్డ రిజర్వాయర్ నీటి ప్రవాహంలో బైక్ తో సహా కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి అతి కష్టం మీద టీచర్ ను ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.