రాయదుర్గం పట్టణంలోని మెలకల్మూరు రోడ్డులో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వందలాది మంది భక్తుల మధ్య ఆంజనేయస్వామి రథంపై ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథాంగ హోమం నిర్వహించి రథంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి రథం లాగారు. చిన్నారులు కళశ హారతులు పట్టారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.