రెవెన్యూ దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీకి పూలమాలలు వేశారు. అనంతరం సునయన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రంజీత్ బాష ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవ కార్యక్రమం నిర్వహించి రెవెన్యూ శాఖ లో ఉత్తమ సేవలు అందించిన వారిని సన్మానించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమైనదన్నారు. సమస్యల కోసం వచ్చే వారితో మర్యాదగా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిదని ఇక్కడ ఉండే విధానాలు ఇ