సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని హద్నూర్ శివారులో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై దోమ సుజిత్ తెలిపారు. సోమవారం సమయంలో గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 3980 నగదు, పేక ముక్కలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మండలంలో ఎక్కడైనా పేకాట, జూదము నిర్వహించిన ప్రోత్సహించిన ఆడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.