కడప జిల్లా జమ్మలమడుగు వైసిపి కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజి ఉండాలనే ఆశయంతో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ తో పర్మిషన్ తీసుకొని గత ప్రభుత్వంలొనే మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభత్వంలో మెడికల్ కాలేజీలకు అలాట్ అయిన మెడికల్ సీట్లను వద్దనడం దారుణమన్నారు. కేవలం కమీషన్ల కోసం ప్రభుత్వ ఆస్తులను పి4 పద్దతిలో ప్రవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని తెలిపారు.