ఇటీవల ప్రధానమంత్రి మనకి బాత్ కార్యక్రమంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు తొడసం కైలాస్ ను అభినందించడం పట్ల జిల్లా కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. గోండ్ , కోలాం భాష అభివృద్ధికై ఎ.ఇ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను కొనియాడుతూ బుధవారం కలెక్టరేట్ లో తొడసం కైలాష్ ను కలెక్టర్ శాలువతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో డిఇఓ ప్రణీత పలురూపాధ్యాయులు ఉన్నారు.