గురువారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కురుస్తున్న వర్షానికి కూరగాయల మార్కెట్ కాలువను తలపించింది గతంలో ఈదురుగాళ్లు రావడంతో రేకులు ఎగిరిపోగా వర్షం పడ్డ నీరు మీద పడకుండా ఉండేందుకు కవర్లు కట్టుకున్నారు వ్యాపారులు అతి భారీ వర్షం పడడంతో వరద నీరు కూరగాయల మార్కెట్లో చేరి ఓ కాలువను తలపించిన పరిస్థితి నెలకొంది వరుణుడు కరుణిస్తే తమ వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి అంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు