రైతుల నుండి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లు, ఇతర జిల్లాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం 12 గంటలు కర్నూలు మార్కెట్ యార్డు లో రైతులు తెచ్చిన ఉల్లి ఉత్పత్తులను పరిశీలించి, రైతులతో మాట్లాడి, అనంతరం అధికారులు, ట్రేడర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులు తీసుకొని వచ్చిన ఉల్లి పంటను పరిశీలిస్తూ, ఎన్ని రోజులు అరబెట్టారని కలెక్టర్ రైతులను ఆరా తీశారు...డ్యామేజి అయిన ఉల్లిని పరిశీలిస్తూ, ఆరబెట్టకుండా మార్కెట్ యార్డ్ కు తీసుకువస్తే డ్యామేజి అవుతుందని, అలా కాకుండా బాగా