జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన రమణయ్య (37) అనే యువకుడు సోమవారం మధ్యాహ్నం తన పొలంలో గడ్డి కోస్తుండగా రక్త పింజరి పాము కాటు వేయడంతో మృతి చెందాడు. పాము కాటుకు గురైన రమణయ్య కేకలు వేయగా, స్థానికులు గమనించి వెంటనే అతడిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే రమణయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో అగ్రహారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.