చిర్యాల- పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం తల పగిలి, మెదడు చిట్లిపోయి గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది. మృతుని వయస్సు సుమారు 40- 45 ఏళ్లు ఉండగా.. నలుపు రంగు ప్యాంటు, షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరిలో భద్రపరిచి జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9701112343, 9618689879 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.