విద్యార్థులు చదువుతోపాటు పాఠ్యాంథర కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శారదా పీఠం ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన గణిత విజ్ఞానమేల సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు