ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చేకూరి సుబ్బాయమ్మ అనే మహిళ అనుమానస్పద మృతి చెందింది. మహిళ మృతి చెందిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి బీరువా తెరిచిన అన్నవాళ్లను గుర్తించారు. కొన్ని సంవత్సరాల క్రితం భర్తతో విడిపోయిన సుబ్బాయమ్మ టీ దుకాణాన్ని నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తుంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కూడా మహిళ క్షేమంగా ఉన్న విషయాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఆదివారం తెలిపారు. అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.