ప్రకృతి సిద్ధమైన సంప్రదాయబద్ధమైన మట్టి వినాయక విగ్రహాల పూజ పుణ్యంతోపాటు ఆరోగ్య కరమని ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, రంగసాయి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 4:30 కు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలంటూ భీమవరం ఎఎంసి రోడ్లో ర్యాలీ నిర్వహించారు. మట్టి వినాయక విగ్రహాలు నీటిలో కరిగిపోతాయని, ప్రతి విద్యార్థి తమ ఇంట వినాయక పూజకు మట్టి విగ్రహాలనే వినియోగించుకోవాలని అన్నారు.