తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని కేకే కళ్యాణ సదన్ లో ఆదివారం శ్రీ భగవాన్ రామ్ దేవ్ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పార్థసారథి దంపతులతో పాటు టిడిపి నేత ఎస్ జె జువెలరీస్ అధినేత పోట్లపూడి రాజేష్ శ్రీ భగవాన్ రామ్ దేవ్ కు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భగవాన్ రామ్ దేవ్ కమిటీ అధ్యక్షులు శంకర్ లాల్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయశ్రీ పార్థసారథి దంపతులతో పాటు పోట్లపూడి రాజేష్ లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ భగవాన్ రామ్ దేవ్ కమిటీ అభివృద్ధికి