గాజువాక లంక గ్రౌండ్లో ఏర్పాటు చేసిన లక్ష చీరలు సుందర గణపతి దర్శనాలను పోలీసులు నిలిపివేసినట్లు ప్రకటించారు. బుధవారం వినాయక విగ్రహం నిర్వాహకులు భక్తులపై చేయి చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసులు జరిపిన విచారణలో అధికారులు ఇచ్చిన ఆదేశాలను బేకతలు చేస్తూ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని నిరూపణ కావడంతో గణపతి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గురువారం సాయంత్రం నుంచి విద్యుత్ని నిలిపేసి భక్తులను బయటకు పంపించి వేశారు. భక్తులకు భద్రతకి ప్రమాదం ఉన్న నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.