వినాయక పండిలు వేసేవారు నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రశాంతంగా పండగ జరుపుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి తెలియజేశారు. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో వినయ్ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వారితో సమావేశమయ్యారు. గణేష్ మండపాల భద్రత చర్యలు మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా విద్యుత్ విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని షార్ట్ సర్క్యూట్ నివారణ కోసం అధిక వేడిని ఉత్పత్తి చేసే బల్బులు కవర్ లేని హాలోజన్ లాంప్ వాడుకూడదన్నారు. చిన్నపిల్లలను విద్యుత్ తీగల సమీపానికి అనుమతించరాదని, కుక్కలో పందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.