విజయవాడలో డయేరియా కారణంగా 100 మంది ఆసుపత్రి పాలయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్. బాబురావు అన్నారు. గురువారం న్యూ రాజరాజేశ్వరిపేటలోని బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాధితుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ సమస్య విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.