కళ్యాణదుర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు దొణస్వామి ఆదివారం ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎంపీ తలారి రంగయ్య పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి కళ్యాణదుర్గం వెళ్లారు. దొణస్వామి మృతదేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి తాను, పార్టీ అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మృతుని కుటుంబ సభ్యులకు సూచించారు.