అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని మరాఠాపల్లిలో ఆదివారం రాత్రి అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు.అల్లుడు వాయగారి నరసింహ రావు అలి యాస్ చిన్న(40) తో భార్య గొడవ పడి కువైట్ కి వెళ్ళగా, పిల్లలను తనతో పంపలేదని అత్త షిండే పద్మ (50) పై కత్తితో దాడి చేశాడు.ఈ దాడి లో తీవ్రంగా గాయపడిన అత్త పద్మ పరిస్థితి విషమం కాగా, రాజంపేటలో ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్ తరలించారు.నందలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.