త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీక బక్రీద్ పండుగ అని ఆళ్లగడ్డ మండల ప్రభుత్వ ఖాజీ మహమ్మద్ జాఫర్ సాదిక్ తెలిపారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా స్థానిక ఈద్గాలో ముస్లిం సోదరులకు తమ సందేశాన్ని ఇచ్చారు. అల్లాహ్ దయతో ప్రజలందరు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలకు అయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. వేలాదిగా ముస్లింలు ఈద్గాకు తరలివెళ్లి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.