ఇద్దరు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఘటన జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లిలో జరిగింది.గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లి అన్నమ్మ (75), కుమార్తె రానమ్మ (45)ను గుర్తుతెలియని దుండగులు చంపేసి,పారిపోయారు.శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి,పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.