జమ్మికుంట: మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే గణపతి నిమజ్జనం ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులతో కలసి మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనంలో లైట్స్ లేని చిత ఏర్పాటు చేయాలని,గుంతలు ఉన్న చోట చిప్స్ నింపాలని అన్నారు. గుండ్ల చెరువు, నాయిని చెరువు, ధర్మారం చెరువు, రామన్నపల్లి చెరువు, కొత్తపల్లి చెరువు ప్రాంతంలో లైట్స్ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కాకతీయ హాస్టల్ , అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ లాంటి ప్రాంతాలలో మినరల్ వాటర్ ప్రజలకు అందించాలని అన్నారు.