సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద గురువారం తనిఖీలు చేపట్టగా అందులో భాగంగా కర్ణాటక బీదర్ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న కర్ణాటక బస్సులో 440 గ్రాముల ఎండు గంజాయి తరలిస్తున్న కరీంనగర్ కు చెందిన తాజ్ మహమ్మద్ ను ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ ఎవరైనా గంజాయి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.