గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తలమడుగు మండలంలోని సోయాబీన్, పత్తి పంటలు పూర్తిగా ఖాతాపూత దశలో తెగుళ్లతో దెబ్బ తినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో సోయాబీన్ పంట 16 వందల ఎకరాలు సాగయింది, జూన్ మాసం నుండి దాదాపు నాలుగు నెలల పంట కాలం దగ్గరికి వచ్చింది, కాయలు చెట్టు నిండా ఉన్న విత్తనం ఊరే సమయంలో పల్లాకు తెగులు రావడంతో విత్తనాలు పెద్దవి కాక దిగుబడులు రాక పూర్తిగా నష్టపోయే అవకాశం ఉందని ఉoడం రైతు కంది నర్సింలు వాపోయారు, అలాగే అధిక మొత్తంలో సాగైనా పత్తి పంట పరిస్థితి కూడా అలాగే ఉంది..