గణేష్ నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ లో అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నిమజ్జనోత్సవం ను ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాల మధ్య జరుపుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలో ప్రతిష్టించిన వినాయకులను గురువారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గణనాధులకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా పలు గణేష్ మండలాల నిర్వాహకులు ఎమ్మెల్యేలు శాలువాతో సత్కరించారు.