నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం ఎలకాటూరు దళితవాడ గ్రామంలో మంగళవారం నగరి డివిజన్ సబ్ యూనిట్ ఆఫీసర్ శివముని డెంగ్యూ, మలేరియా జ్వరాల నివారణపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల నివారణకు స్ప్రే చేయించారు. అనంతరం గ్రామంలో పర్యటించి తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.