తాడిపత్రి పట్టణంలోని 30 వార్డులో ఉన్న భగత్ సింగ్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైను బ్లాక్ అయ్యి బయటకు మురుగునీరు బయటకు వస్తోంది దీంతో మరమ్మతులు చేపట్టారు. మురుగునీరు రోడ్లపైకి వచ్చి దుర్వాసన వస్తుందడంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కౌన్సిలర్ మల్లికార్జున మరమత్తు పనులను చేపట్టారు. ట్రాక్టర్ తో పంపును ఏర్పాటు చేసి వేరొక ఛాంబర్ లోకి మురుగునీరును పంపించే ఏర్పాట్లను చేశారు దీంతో కాలనీవాసులు మల్లికార్జున కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.