నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం గణేష్ నిమజ్జన శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణనాథులు తిలకించేందుకు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికోసం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పులిహోర పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు భక్తులకు ఇబ్బందులు కాకుండా ఏర్పాట్లు చేశారు.