శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో టింబక్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వంటకాల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. స్వయంగా వంటలు వండి పుట్టపర్తి వాసులకు వడ్డించారు. ఈ క్రమంలోనే టింబక్టు ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను అమ్మకానికి ఉంచారు. సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటామని, ప్రతి ఒక్కరూ సేంద్రీయ వంటకాలను అలవర్చుకోవాలన్నారు. తాతల కాలం నాటి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని అందులో పండించిన పంటలు కూడా ఎటువంటి రసాయనాలు లేకుండా మనకు అందుతాయన్నారు