యాదాద్రి భువనగిరి జిల్లా: ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని సోమవారం కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాములు అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని గౌడ సంఘం కమిటీ హాల్లో కల్పిత కార్మిక సంఘం మండల పదవ మహాసభ పూజారి కుమారి స్వామి అధ్యక్షతన నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన వృత్తి కల్లుగీత వృత్తి అని ఇట్టి వృత్తిని గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రమాదం అని తెలిసిన తమ కుటుంబాల జీవన ఉపాధి కోసం గీత కార్మికులు కొనసాగిస్తున్నారన్నారు.