భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం సాయంత్రం ఐదు గంటలకు పత్రిక సమావేశంలో బాసిత్ హత్యకు కారణమైన నిందితుల వివరాలు వెల్లడించారు డిఎస్పీ సంపత్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బుధవారం రోజున జిల్లా కేంద్రానికి చెందిన 22 సంవత్సరాల బాసిథ్ అనే యువకుడ్ని కిడ్నాప్ చేసి మేడారం సమీపంలోని అడవిలో అతి దారుణంగా పెట్రోల్ పోసి కత్తులతో పొడిచి చంపిన ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.పాత కక్షల నేపద్యంలోనే ఈ హత్య చేసినట్లు నిందితులు తెలిపారు.ఈ సమావేశంలో సిఐ నరేష్ కుమార్ గౌడ్ ,ఎస్ఐ సాంబమూర్తి,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.